ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీపై దృష్టి పెట్టిన నాగ్

ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీపై దృష్టి పెట్టిన నాగ్

Published on Aug 29, 2015 11:11 AM IST

nagarjuna
5 పదుల వయసు దాటినా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునని ఇప్పటికీ నవయువ మన్మధుడు లానే అనిపిస్తాడు. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు చేసిన నాగార్జున తెలుగు ప్రజల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటికే లవ్, యాక్షన్, ట్రాజిడీ, భక్తిరస, జానపద సినిమాలలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన నాగార్జున పుట్టిన రోజు ఈ రోజు. నేను ఆయన తన 55వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. ‘శివ’ సినిమాతో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాని తెలుగు తెరకెఇ పరిచయం చేసి ఆ తర్వాత ఎన్నో యాక్షన్ సినిమాలు చేసి మెప్పించిన నాగ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూల్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లోనే కనిపిస్తున్నారు.

తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన తదుపరి సినిమా ఎలాంటిది చేయాలి అనుకుంటున్నాను అనేదానిపై స్పందించాడు. ‘ఈ మధ్య కాలంలో వరుసగా సున్నితమైన, కుటుంబ కథా విలువలు ఉన్న సినిమాలే చేస్తూ వస్తున్నాను. అర్జంట్ గా ఓ పవర్ ప్యాక్ యాక్షన్ సినిమా చేయాలనుకుంటున్నాను. అందుకే నా వయసుకు తగ్గా ఓ యాక్షన్ సినిమాని ఎంపిక చేసే పనిలో ఉన్నానని’ నాగార్జున తెలిపాడు. ఈ లెక్కన మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో నాగార్జున ట్రెండ్ సెట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’, కార్తీ – తమన్నాలతో కలిసి చేస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జునకి 123తెలుగు. కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు