అభిమానుల కోసం సప్రైజ్ ప్లాన్ చేసిన నాని !

అభిమానుల కోసం సప్రైజ్ ప్లాన్ చేసిన నాని !

Published on May 23, 2017 5:25 PM IST


‘భలే భలే మగాడివోయ్’ తో మొదలుపెట్టి ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ, జెంటిల్మెన్, నేను లోకల్’ లాంటి వరుస విజయాల్ని అందుకున్న యంగ్ హీరో నాని ప్రస్తుతం నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘నిన్ను కోరి’ సినిమా చేస్తున్నాడు. మేకింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. నాని కూడా ఫస్ట్ లుక్ తోనే సినిమా మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుందని క్లారిటీ ఇచ్చాడు.

ఇదిలా ఉండగా రేపు 24వ తేదీ ఈ సినిమా గురించి నాని ఒక ప్రకటన చేయనున్నారట. ఇది ఆయన అభిమానులకు, సినిమా కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు పెద్ద సప్రైజ్ లా ఉంటుందని అంటున్నారు. మరి నాని తన ప్రకటనలో సినిమా ఆడియో గురించి డేట్ గురించి చెప్తారో లేకపోతే రిలీజ్ తేదీని ప్రకటించేస్తారో చూడాలి. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేత థామస్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి ఒక కీలక పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు