‘నేను లోకల్’ లోని ఆ పాటకు మిలియన్ వ్యూస్ !

‘నేను లోకల్’ లోని ఆ పాటకు మిలియన్ వ్యూస్ !

Published on Jan 24, 2017 5:12 PM IST

nenu-local
నాని నటించిన తాజా చిత్రం నేను లోకల్ ఫిబ్రవరి 3 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు,ట్రైలర్ యువతని బాగా ఆకట్టుకుంటున్నాయి.దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా నేనులోకల్ ఆల్బమ్ లోని మొదటి సాంగ్ ‘నెక్స్ట్ ఏంటి’ యూత్ కి తెగ నచ్చేసింది. యూట్యూబ్ లో ఈ పాటకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి.

దేవిశ్రీ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ నాని చిత్రానికి సంగీతం అందించడం ఇదే తొలిసారి.కాగా ఈ చిత్రం లోని మిగిలిన పాటలు కూడా ఆకట్టుటకునేలా ఉన్నాయి.ఇప్పటికే పాటలు బాగా పాపులర్ కావడంతో సినిమా పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. కీర్తి సురేష్ ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు