యుట్యూబ్ లో సంచలనం క్రియేట్ చేస్తున్న నిహారిక షో

యుట్యూబ్ లో సంచలనం క్రియేట్ చేస్తున్న నిహారిక షో

Published on Feb 10, 2016 7:22 PM IST

niharika1
యాంకర్ గా బుల్లితెరపై మార్కులు కొట్టేసిన మెగా ఫ్యామిలీ వారసురాలు కొణిదెల నీహారిక. త్వరలోనే వెండితెరపై కూడా హీరోయిన్ గా అరంగేట్రం చేయనుంది. వెండితెర విషయం ఏమోగాని యూ ట్యూబ్ లో మాత్రం సంచలనం క్రియేట్ చేస్తున్నది. నిహారిక తన సొంత సంస్థ అయిన “పింక్ ఎలిమెంట్ పిక్చర్స్” పై ఒక కథను ‘అవకాయ్ ముద్దపప్పు’ పేరుతో షూట్ చేసి రెండు వారాలకోసారి వెబ్ సీరిస్ లో భాగంగా యూ ట్యూబ్ లో పెడుతున్నారు.

సంక్రాతికి మొదటి పార్ట్ ని, తరువాత రెండు వారాలకు రెండో భాగాన్ని రిలీజ్ చేసి ఇప్పుడు ముచ్చటగా మూడో భాగాన్ని కూడా రిలీజ్ చేసారు. ఈ వెబ్ సిరిస్ కి నెటిజన్స్ నుంచి విపరీతమైన స్పందన లభిస్తున్నది. మొదటి భాగానికి 9 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఈ సిరిస్ కి నిహారిక ఫ్రెండ్ అయిన ప్రణీత్ దర్శకుడు. అరేంజ్డ్ మారేజ్ నేపథ్యంగా సాగుతున్న ఈ వెబ్ సిరిస్ లో నిహారిక సరసన ప్రతాప్ అనే కుర్రాడు నటిస్తున్నాడు.

నిహారిక ప్రస్తుతం “మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు” సినిమా దర్శకుడు జి.వి. రామరాజు దర్శకత్వం లో రూపుదిద్దుకుంటున్న “ఒక మనసు” అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కాబోతున్నది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు