‘కార్తికేయ’ సక్సెస్ పై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్న నిఖిల్

‘కార్తికేయ’ సక్సెస్ పై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్న నిఖిల్

Published on Oct 23, 2014 5:01 PM IST

Nikhil
యంగ్ హీరో నిఖిల్, స్వాతి జంటగా నటించిన సినిమా ‘కార్తికేయ’. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నిఖిల్ కెరీర్లోనే అత్యధికంగా సుమారు 250కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఒక్క ఇండియాలోనే కాకుండా యుఎస్ లో కూడా ఈ సినిమా సుమారు 36 లోకేషన్స్ లో రిలీజ్ చేస్తారు.

ఈ సినిమా ట్రైలర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అంతే కాకుండా నిఖిల్ కూడా ఈ సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అంతే కాకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి కమర్షియల్ గా కూడా తనే కెరీర్ బెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని నిఖిల్ ఆశిస్తున్నాడు. మరి నిఖిల్ అనుకున్నది జరుగుతుందా లేదా అని తెలియడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఆంధ్ర – తమిళనాడు బార్డర్లో ఒక టెంపుల్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ కథలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ సినిమా ద్వారా చందు మొండేటి దర్శకుడిగా పరిచయం కానున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. తమిళంలో కూడా రూపొందిన ఈ సినిమా తమిళ వెర్షన్ ని నవంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు