క్యారెక్టర్ కోసం 45రోజులు న్యూయార్క్ లోనే ఉన్నాను : నిఖిల్

క్యారెక్టర్ కోసం 45రోజులు న్యూయార్క్ లోనే ఉన్నాను : నిఖిల్

Published on Dec 1, 2015 8:22 AM IST

Nikhil

యంగ్ హీరో ‘నిఖిల్ సిద్దార్థ్’ నటించిన క్రైమ్ కామెడీ మూవీ ‘శంకరాభరణం’ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ఎన్నారై పాత్రలో నటిస్తున్న నిఖిల్ ఆ క్యారెక్టర్ ని స్టడీ చేయటం కోసం నెలరోజులకు పైగా న్యూయార్క్ నగరం లో గడిపినట్లు తెలిపారు.

ఓ ప్రముఖ న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెబుతూ ‘ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ కోసం ఎన్నారైలను దగ్గర నుండి స్టడీ చేయాల్సి వచ్చింది. అందుకోసం నేను షూటింగ్ కు ముందు 45 రోజుల పాటు న్యూయార్క్ లో అక్కడి మనుషులను దగ్గర నుండి చూస్తూ గడిపాను. నాలో నేను కొన్ని మార్పులను చేసుకొని క్యారెక్టర్ కు కావలసినట్టుగా తయారవటానికి అది నాకు ఎంతగానో ఉపయోగపడింది’ అన్నారు. ఈ సినిమాలో నిఖిల్ ఇండియా గురించి ఏమీ తెలియని ఎన్నారై కుర్రాడిగా నటించాడు. ఈ పాత్ర సుభాష్ కపూర్ దర్శకత్వం వహించిన ‘పాస్ గయే రే ఒబామా’ లోని పాత్రల స్పూర్తిగా తీసుకోబడింది.

కొత్త దర్శకుడు ‘ ఉదయ్ నందనవనం’ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో ‘నందిత రాజ్’ హీరోయిన్ కాగా, ‘అంజలి’ ఓ ముఖ్యమైన ‘బీహారీ డాన్’ పాత్రలో కనిపిస్తోంది. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు