వంటలో తన చాతుర్యాన్ని చూపిన ఎన్.టి.ఆర్

వంటలో తన చాతుర్యాన్ని చూపిన ఎన్.టి.ఆర్

Published on Jan 25, 2015 1:41 PM IST

ntr2
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేస్తున్న ‘టెంపర్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దాంతో ఎన్.టి.ఆర్ కాస్త రిలాక్స్ అవుతున్నాడు. ప్రకాష్ రాజ్ ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉన్న ఎన్.టి.ఆర్ శుక్రవారం రాత్రి తన ఫాం హౌస్ లో కాస్త రిలాక్స్ అవ్వడమే కాకుండా తన కుకింగ్ టాలెంట్ ని కూడా చూపించాడు.

మామూలుగా ప్రకాష్ రాజ్ తన సన్నిహితులకు, స్నేహితులకు తన ఫాం హౌస్ లో డిన్నర్ పార్టీస్ ఇస్తుంటాడు. అదే విధంగా శుక్రవారం రాత్రి జరిగిన పార్టీలో ఎన్.టి.ఆర్ ప్రకాష్ రాజ్ కోసం ఒక పిజ్జాని తయారు చేసాడు. ఈ మోమెంట్ ని బాగా ఎంజాయ్ చేసిన ప్రకాష్ రాజ్ మరియు అతని భార్య పోనీ వర్మ తమ ఆనందాన్ని ట్విట్టర్ లో ఎక్స్ ప్రెస్ చేసారు. అంతే కాకుండా ఎన్.టి.ఆర్ కుకింగ్ ఫోటోలను కూడా పోస్ట్ చేసారు. టెంపర్ మూవీ ఆడియో జనవరి 28న రిలీజ్ కానుంది. ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు