అందరినీ షాక్ చేసిన ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ లుక్

అందరినీ షాక్ చేసిన ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ లుక్

Published on Nov 26, 2014 6:46 PM IST

Ntr_temper-(3)
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘టెంపర్’ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ వారందరినీ షాక్ చేసేలా ఈ రోజు మధ్యాహ్నం టెంపర్ మూవీలోని కొన్ని ఎన్.టి.ఆర్ స్టిల్స్ లీక్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఈ లీక్ అయిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. అలా లీక్ అయిన ఫోటోలలో రెండు ఫోటోలలో ఎన్.టి.ఆర్ స్టైలిష్ హెయిర్ స్టైల్ తో లుక్ డిఫరెంట్ గా ఉంటే ఒక ఫోటోలో మాత్రం బేర్ బాడీతో 6 ప్యాక్ లుక్ లో ఉన్నాడు.

ఈ ఫొటోలకి సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచిన ఈ ఫోటోలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. చాలా కాలం క్రితం లావుగా ఉన్న ఎన్.టి.ఆర్ కాస్తా స్లిమ్ లుక్ లోకి వచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు స్లిమ్ అండ్ సిక్స్ ప్యాక్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పూరి జగన్నాధ్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ కి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు