S/O సత్యమూర్తి ఆడియో వేడుకకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్

S/O సత్యమూర్తి ఆడియో వేడుకకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్

Published on Mar 5, 2015 1:28 AM IST

Pawan-Kalyan-new-look
రామ్ చరణ్ హీరోగా ఓ కొత్త సినిమాను తీయనున్నట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించారు. ఈ విషయం పై రామ్ చరణ్ కూడా తన సంతోషాన్ని వెలిబుచ్చాడు. దీంతో గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ లో విభేదాలు ఉన్నాయన్న వార్తలకు పవన్ చెక్ పెట్టినట్లు అయ్యింది. అయితే తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వం లో అల్లు అర్జున్ నటిస్తున్న S/O సత్యమూర్తి చిత్ర ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు సమాచారం.

సమంతా, నిత్యామీనన్, అదా శర్మలు అల్లు అర్జున్ సరసన హీరోయిన్ లు నటించగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మార్చి 8 న ఈ సినిమా కు సంబంధించిన ఆడియో ను విడుదల చేయనున్నారు. అంతేకాకుండా ఈ వేసవి లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు