Like us on Facebook
 
పవన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయనున్నారా ?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తప్పకుండా భారీ హిట్ అవుతుందని, తమకు కావాల్సిన ఎనర్జీని ఇస్తుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకాలు పెట్టుకున్నారు. అందుకే త్రివిక్రమ్ – పవన్ లు సినిమాను అన్ని విధాలా అభిమానులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ స్వయంగా ఒక పాటను పాడనున్నారని తెలుస్తోంది. సంగీత దర్శకుడు అనిరుద్ ఈమేరకు ఒక స్టైలిష్ పాటను సిద్ధం చేశారని అంటున్నారు. దీంతో అభిమానుల్లో అప్పుడే కోలాహలం మొదలైంది. పవన్ మరోసారి తన పాటతో మ్యాజిక్ చేయడం ఖాయమని ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో పవన్ పాటలు పాడిన ‘ఖుషి, తమ్ముడు, అత్తారింటికి దారేది’ వంటి సినిమాలు ఘన విజయాల్ని సాధించిన సంగతి తెలిసిందే.

Bookmark and Share