‘పెళ్ళిచూపులు’ ఏయే భాషల్లోకి వెళుతోందంటే..!

‘పెళ్ళిచూపులు’ ఏయే భాషల్లోకి వెళుతోందంటే..!

Published on Jan 23, 2017 3:13 PM IST

Pellichoopulu
గతేడాది జూలై నెలలో విడుదలైన ‘పెళ్ళిచూపులు’ అనే సినిమా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాను అన్ని ప్రధాన భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు పోటీపడ్డారు. దీంతో ఈ సినిమా రీమేక్ హక్కులు భారీ మొత్తాలకు అమ్ముడయ్యాయి. తమిళంలో ప్రముఖ దర్శక, నిర్మాత గౌతమ్ మీనన్ పెళ్ళిచూపులును రీమేక్ చేస్తూండగా, కన్నడ, హిందీ పరిశ్రమల్లోనూ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ రీమేక్ చేస్తున్నాయి.

కన్నడ, హిందీ, తమిళం.. ఇలా మూడు ప్రధాన భాషల్లో రీమేక్ అవుతోన్న సినిమా మళయాలంలో మాత్రం డబ్ అవుతోంది. త్వరలోనే ఈ డబ్బింగ్ వర్షన్ విడుదలవుతుందని పెళ్ళిచూపులు దర్శక, నిర్మాతలు తెలిపారు. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖ్యంగా కౌశిక్ అనే పాత్రలో నటించిన ప్రియదర్శి సినిమా విడుదల తర్వాత అంతటా పాపులర్ అయిపోయారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు