’ప్రేమమ్’ విడుదల ఎప్పుడంటే…?

’ప్రేమమ్’ విడుదల ఎప్పుడంటే…?

Published on May 28, 2016 4:40 PM IST

Premam-m
మళయాలం లో గత సంవత్సరం సూపర్ హిట్ అయిన సినిమా ‘ప్రేమమ్’. ఈ సినిమా ’కార్తికేయ’ ఫేం చందు మొండేటి దర్శకత్వం లో నాగ చైతన్య హీరో గా తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసి జులై చివరికి మొదటికాపీ ని సిద్ధం చేయాలని టీం భావిస్తున్నట్టు తెలిసింది. మొదట్లో ఈ సినిమాని జులై లో విడుదల చేయాలనుకున్న ఇప్పుడు ఆగష్టు 12 న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన శ్రుతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తుండగా గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు