ఇంటర్వ్యూ : పూజ కుమార్ – ‘పిఎస్వి గరుడవేగ’ పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుంది !

ఇంటర్వ్యూ : పూజ కుమార్ – ‘పిఎస్వి గరుడవేగ’ పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుంది !

Published on Oct 30, 2017 1:41 PM IST

సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన తాజా చిత్రం ‘పిఎస్వి గరుడవేగ’ లో నటి పూజ కుమార్ హీరోయిన్ గా నటించారు. నవంబర్ 3న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ విశేషాలు మీకోసం..

ప్ర) ‘పిఎస్వి గరుడవేగ’ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ఈ సినిమా మంచి యాక్షన్ థ్రిల్లర్. వాటితో పాటే సినిమాలో డ్రామా, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. తెలుగు ఇండస్ట్రీలో ఇదొక పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుంది. ఈ సినిమానని థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయాలి. ఇందులో ట్రైన్స్, బైక్స్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. చాలా బాగుంటాయి.

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో నాది హౌస్ వైఫ్ క్యారెక్టర్. భర్త దేశం కోసమే ఎక్కువ టైమ్ కేటాయిస్తుంటాడు. భర్తకు ఏమవుతుందో అని ఎప్పుడూ టెంక్షన్ పడుతూ అతని నుండి కేరింగ్, అటెంక్షన్ కోరుకునే భార్యగా నటించాను.

ప్ర) ఇది పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుందని ఎలా చెప్పగలుగుతున్నారు ?
జ) సినిమలో షాట్స్ ను తెలిసిన విధానం అలాంటిది. ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ ఉంటారు. కానీ ఇందులో 10 ముఖ్యమైన క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి దానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది.

ప్ర) ఇదే తెలుగులో మీకు మొదటి సినిమా.. దీన్ని ఎలా ఒప్పుకున్నారు ?
జ) నేను చల్ స్క్రిప్ట్స్ విన్నాను. కానీ ప్రవీణ్ సత్తారు 120 పేజీలున్న బౌండెడ్ స్క్రిప్ట్ నాకిచ్చారు. అది చదువుతుంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది. అందుకే చేశాను. అతని విజన్ నాకు చాలా బాగా నచ్చింది.

ప్ర) రాజశేఖర్ గారితో వర్క్ ఎలా ఉంది ?
జ) రాజశేఖర్ గారు చాలా ఎనర్జిటిక్. ఆయన ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. ఏ సినిమాకి ముందు ఆయన పోలీస్ గా నటించిన కొన్ని సినిమాలు చూశాను. అద్భుతంగా నటించారు. యాక్షన్స్ సన్నివేశాలైతే చాలా బాగా చేశారు.

ప్ర) యాక్షన్స్ సీన్స్ లో మీరు కూడా ఉంటారా ?
జ) అవును. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో నేను కూడా ఉంటాను. మాములుగా క్లైమాక్స్ లో హీరో, విలన్ మాత్రమే ఉంటారు. కానీ ఈ సినిమా క్లైమాక్స్ లో నేను కూడా ఉంటాను.

ప్ర) చాలా సినిమాల్లో హౌస్ వైఫ్ పాత్రలు చేశారు కదా బోర్ కొట్టడంలేదా ?
జ) లేదు. నాకేలాంటి బోర్ అనిపించవు. నిజానికి హౌస్ వైఫ్ పాత్రలలోనే చాలా విశేషాలుంటాయి.

ప్ర) ఎక్కడెక్కడ షూట్ చేశారు ?
జ) చాలా లొకేషన్లో షూట్ చేశాం. మలేషియా, జార్జియాలోని అత్యంత ఎత్తైన, పెద్దదైన ఇంగురి డ్యామ్ మీద కూడా షూట్ చేశాం. కఠినమైన వాతావరణంలో పని చేశాం. చాలా కష్టపడ్డాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు