డీ గ్లామర్ పాత్రలో హాట్ బ్యూటీ..!

డీ గ్లామర్ పాత్రలో హాట్ బ్యూటీ..!

Published on May 26, 2016 11:37 PM IST

raasi-kanna
రాశి ఖన్నా… ’ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో హాట్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ’బెంగాల్ టైగర్’ సినిమాలో రవితేజ సరసన నటించిన ఈ బ్యూటీ ఇటీవలే సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన ’సుప్రీమ్’ ద్వారా మంచి హిట్ అందుకుంది.

ఇప్పటివరకూ తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం గోపీచంద్ సరసన నటిస్తున్న ’ఆక్సిజన్’ సినిమాలో పూర్తిగా డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. గ్రామీణ యువతిగా పూర్తిగా సాంప్రదాయ యువతిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో రాశి ఖన్నా జగపతి బాబు కూతురుగా కనిపించబోతున్నది. ఏయమ్ రత్నం కుమారుడు ఏమ్ జ్యోతి క్రిష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు