2017 కి నా ఫెవరేట్ సినిమా అదేనంటున్న రాజమౌళి !

2017 కి నా ఫెవరేట్ సినిమా అదేనంటున్న రాజమౌళి !

Published on Dec 12, 2017 1:54 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి నటీ నటులు, దర్శకులు ఎవరైనా సరే సినిమా బాగుంటే తప్పకుండా ప్రశంసిస్తారు. సినిమా బాగా నచ్చితే దాని ప్రస్తావన వచ్చినప్పుడల్లా మాట్లాడుతుంటారు. ఈ 2017 సంవత్సరానికి గాను ఒక్క తెలుగులోనేగాక ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘బాహుబలి-2’ ను అందించిన ఆయన తన ఫెవరేట్ సినిమా మాత్రం వేరే ఉందని చెబుతున్నారు.

ఆ సినిమానే ‘అర్జున్ రెడ్డి’. సినిమా విడుదలైన మొదటిరోజే దాన్ని తిలకించి ప్రశంసించిన ఆయన ఈ ఏడాదికిగాను తనకు బాగా నచ్చిన సినిమా ‘అదే అన్నారు. ఆగష్టులో విడుదలైన ఈ సినిమా సంచలనం విజయం సాధించి దాదాపు రూ.25 కోట్లు కలెక్ట్ చేసింది. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన విజయ్ దేవరకొండ, షాలిని పాండేలకు మంచి బ్రేక్ దొరికి వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు