రామ్ చరణ్, రకుల్ కాంబోలో మరో సినిమా?

రామ్ చరణ్, రకుల్ కాంబోలో మరో సినిమా?

Published on Feb 7, 2016 8:03 PM IST

ram
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. తమిళంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘తని ఒరువన్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ చివరిదశకు చేరుకున్నాయి. త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారనే విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు.

తని ఒరువన్‌లో హీరోయిన్ పాత్రకు రకరకాల పేర్లు వినిపించగా, తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ దాదాపుగా ఖరారైపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యే నాన్నకు ప్రేమతో సినిమాతో హిట్ కొట్టిన రకుల్, ఆ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో తెలుగులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటున్నారు. నయనతార చేసిన స్ట్రాంగ్ హీరోయిన్ రోల్‌కు తెలుగులో రకుల్ దాదాపుగా కన్‌ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు రక్షక్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు