టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చివరిసారిగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఫ్యామిలీ స్టార్ (The Family star) చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ఒక చిత్రం ను చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంతో పాటుగా ఇటీవల రాజావారు రాణిగారు ఫేమ్ డైరెక్టర్ రవి కిరణ్ కోల దర్శకత్వం లో మరొక చిత్రం కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, మైత్రి మూవీ మేకర్స్ వారు సోషల్ మీడియాలో సరికొత్త పోస్ట్ ను చేశారు. రేపు ఉదయం 11:07 గంటలకు వారి సరికొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించనున్నారు. ఇదే విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఇది విజయ్ దేవరకొండ లేటెస్ట్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. గతంలో టాక్సీవాలా చిత్రం ను డైరెక్ట్ చేసిన రాహుల్ సంకృత్యాన్‌తో ఈ చిత్రం ఉండనుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పీరియాడికల్ ఫిల్మ్‌గా ఉండనున్నట్లు సమాచారం. రేపు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు రేపు తెలియనున్నాయి.
'A wild ride into untold HIStory' ⚔️
Announcement tomorrow at 11.07 AM ????
An epic from the house of @MythriOfficial. pic.twitter.com/34cX3btq7s
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2024