ఇండియన్ సినిమా దిగ్గజ నటులు దర్శకుల్లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అలాగే దర్శకుడు మణిరత్నం కూడా ఒకరు. మరి “నాయకుడు” తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకి రిపీట్ అయ్యి వస్తున్నా సినిమానే “థగ్ లైఫ్”. మరి భారీ తారాగణం పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ మళ్ళీ శరవేగంగా కొనసాగుతుంది. అయితే గతంలో కాస్త ఆలస్యం అయ్యిన ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ కి వెళుతుంది అని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు మేకర్స్ ఓ సర్ప్రైజ్ నే అందించారు. ఈ చిత్రం ఈ ఏడాది లోనే రిలీజ్ అవుతుంది అని ప్రెస్ నోట్ లో పొందుపరిచారు. మరి ఈ ఏడాదిలోనే రిలీజ్ అంటే ఫ్యాన్స్ కి కూడా ఇది ఒకరకమైన సర్ప్రైజ్ అని చెప్పాలి. మరి ఈ కథ మణిరత్నం, కమల్ హాసన్ లు డెవలప్ చేయగా సబ్జెక్టుపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా అయితే ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రాజ్ కమల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ నిర్మాణం వహిస్తున్నారు.