యామి గౌతమ్, ప్రియమణి, రాజ్ అర్జున్ లు ప్రధాన పాత్రల్లో, ఆదిత్య సుహస్ జంభ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఆర్టికల్ 370. ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం ను చూసిన రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదిక గా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడే ఈ చిత్రాన్ని చూసాను. దీన్ని చిత్రీకరించిన అద్భుతమైన విధానం మరియు మన దేశంలోని అద్భుతమైన నటులు మరియు వాస్తవికత కోసం ప్రతి ఒక్కరూ దీన్ని ఒకసారి చూడాలి అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది. 2019 లో ఫిబ్రవరి 14 వ తేదీన పుల్వామా దాడి జరిగిన తరువాత జమ్ము కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ను కల్పించే విధంగా ఆర్టికల్ 370 ను రద్దు చేసే అంశం పై సినిమా తెరకెక్కింది. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించిన ఈ చిత్రం లో స్కంద్ సంజీవ్ ఠాకూర్, వైభవ్ తత్వవాడి, అరుణ్ గోవిల్, కిరణ్ కర్మాకర్ లు కీలక పాత్రల్లో నటించారు.