సందీప్ కిషన్ “మాయవన్” టీజర్ కి టైమ్ ఫిక్స్!

సందీప్ కిషన్ “మాయవన్” టీజర్ కి టైమ్ ఫిక్స్!

Published on May 9, 2024 12:01 AM IST

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చివరిసారి గా ఊరు పేరు భైరవకోన చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సివి కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మాయవన్. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను సందీప్ కిషన్ పుట్టిన రోజున రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం కి సంబందించిన టీజర్ విడుదల కావాల్సి ఉండగా, ఆలస్యం అయ్యింది. తాజాగా మేకర్స్ టీజర్ విడుదల పై క్లారిటీ ఇచ్చారు. గురువారం రోజున ఉదయం 11:07 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష రంజన్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు