కార్తికేయ “భజే వాయు వేగం” కి రిలీజ్ డేట్ ఖరారు

కార్తికేయ “భజే వాయు వేగం” కి రిలీజ్ డేట్ ఖరారు

Published on May 8, 2024 9:31 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అలాగే విలన్ గా కూడా మెప్పించే నటుడు కార్తికేయ హీరోగా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “భజే వాయు వేగం” కోసం తెలిసిందే. ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ మంచి బజ్ ని అందుకుంది. కొత్త కాన్సెప్ట్ మరియు ఎమోషన్స్ తో వచ్చిన టీజర్ ఆకట్టుకోగా ఇప్పుడు మేకర్స్ ఫైనల్ గా రిలీస్ డేట్ ని అయితే రివీల్ చేసేసారు.

కార్తికేయ పై ఒక స్ట్రైకింగ్ పోస్టర్ తో ఈ మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఈ సినిమా కోసం అయితే అప్పుడు వరకు ఆగాలి. ఇక ఈ చిత్రంలో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా రధన్, కపిల్ కుమార్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు