Like us on Facebook
 
‘అర్జున్ రెడ్డి’ బ్లడీ బోల్డ్ అన్న రామ్ చరణ్ !


విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘అర్జున్ రెడ్డి’ సూపర్ హిట్ టాక్ తో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవలం ప్రేక్షకులను మాత్రమే కాక సినీ పెద్దల్ని, స్టార్ హీరో హీరోయిన్లని కూడా అమితంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మహేష్ బాబు, అనుష్క వంటి స్టార్లంతా సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయగా తాజాగా స్టార్ హీరో రామ్ చరణ్ కూడా ఈ బోల్డ్ సినిమాను చూసి ఈ బోల్డ్ కామెంట్ చేశారు.

‘అర్జున్ రెడ్డి చూశాను. రా, రియలిస్టిక్, బ్లడీ బోల్డ్ గా ఉంది. సందీప్ వంగ, విజయ్ దేవరకొండ, షాలిని, రాహుల్ రామకృష్ణలకు హ్యాట్స్ ఆఫ్’ అంటూ తన పేస్ బుక్ పేజీ మీద పోస్ట్ పెట్టారు. ఇలా స్టార్లంతా ఎలాంటి ఈగో లేకుండా సినిమా బాగుందనడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత ఎక్కువై కలెక్షన్లు ఇప్పటికీ మెరుగ్గానే సాగుతున్నాయి. ‘A’ సర్టిఫికెట్ పొందినప్పటికీ యూఎస్ లో సైతం సినిమా బ్రహ్మాండంగా ఆడుతూ ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ మార్కును దాటేసింది.

Bookmark and Share