ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితోనే రామ్ నెక్స్ట్ సినిమా ?

ram
‘హైపర్’ చిత్రంతో పర్వాలేదనిపించుకున్న యంగ్ హీరో రామ్ తన తరువాతి చిత్రంపై చాలా కసరత్తులు చేశాడు. ముందుగా యువ దర్శకుడు, ‘పటాస్, సుప్రీం’ వంటి విజయాలనందుకున్న అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తాడని, అది పూర్తి ప్రయోగాత్మక చిత్రమని అన్నారు. కానీ అందులో హీరో పాత్రకు చూపు ఉండదు కనుక మరీ అంత ప్రయోగమెందుకని అనుకున్నాడో ఏమో రామ్ ఆ సినిమాని కాదని ప్రస్తుతం దర్శకుడు కరుణాకరన్ టు జతకట్టే పనిలో ఉన్నాడట.

కరుణాకరన్ కు ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలేమీ లేవు. ఆయన చివరి చిత్రం ‘చిన్నదాన నీకోసం’ అంతంత మాత్రమే అనిపించుకోగా గతంలో రామ్ తో చేసిన ‘ఎందుకంటే ప్రేమంట’ పరాజయంగా నిలించింది. అయినా కూడా రామ్ అతనితోనే సినిమా తీయాలనే ప్రయత్నంలో ఉన్నాడని, కరుణాకరన్ చెప్పిన కథ విపరీతంగా నచ్చడం వలనే రామ్ కరుణాకరన్ తో పని చేయాలనుకుంటున్నాడని అంటున్నారు. అన్నీ కుదిరితే 2017 జనవరిలో సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందట. మరి రామ్ ను అంతలా ఆకట్టుకున్న ఆ కథేమిటో ఆయనే స్వయంగా చెబితే గానీ తెలీదు.

Bookmark and Share