‘రోబో-2’ కోసం వరల్డ్ టూర్ !

‘రోబో-2’ కోసం వరల్డ్ టూర్ !

Published on Jun 24, 2017 5:23 PM IST


సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘రోబో 2.0’. 2010లో రిలీజైన భారీ బ్లాక్ బస్టర్ చిత్రం ‘రోబో’ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో చాలా గ్రాండ్ గా నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను 2018 జనవరి 25న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా చిత్ర టీమ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చేందుకు భారీ స్థాయిలో ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా వరల్డ్ టూర్ కు టీమ్ రెడీ అవుతోంది. కొద్దిసేపటి క్రితమే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం ఒక వీడియోను పోస్ట్ చేసి ప్రపంచయాత్ర గురించిన హింట్ ఇచ్చారు. అయితే ఈ టూర్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఇందులో పాల్గొంటారు అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. రజనీ చివరి సినిమా ‘కబాలి’ కి కూడా విమానాల మీద ప్రకటనలు వేయడం వంటి సరికొత్త, ఖరీదైన ఆలోచనతో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు