‘సింగం 3’ కి కొత్త విడుదల తేది ?

‘సింగం 3’ కి కొత్త విడుదల తేది ?

Published on Jan 24, 2017 6:06 PM IST

singam3
జనవరి 26 న విడుదల కావలసిన సూర్య చిత్రం సింగం 3 వాయిదా పడిందని మేము ఇదివరకటికే తెలియజేశాము.జల్లికట్టు నిరసనలతో తమిళనాడులో నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర విడుదల కోసం నిర్మాతలు కొత్త విడుదల తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3 న విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఇప్పటికే పలుమార్లు ఈ చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.ఈ చిత్రంలో సూర్య సరసన శృతి హాసన్, అనుష్కలు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు