షూటింగ్ పూర్తిచేసుకున్న సమంత కొత్త చిత్రం !
Published on Dec 28, 2017 12:15 pm IST

తెలుగు స్టార్ హీరోయిన్ సమంత, తమిళ హీరో విశాల్ జంటగా ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ కొద్దిసేపటి క్రితమే పూర్తైంది. దీంతో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తమిళంలో ‘ఇరుంబుతిరై’ గా రిలీజ్ కానున్న ఈ చిత్రం తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో రానుంది.

ముందుగా ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 13న విడుదలచేయాలని అనుకున్నా కొని అనివార్య కారణాల వలన వాయిదావేశారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటితం కాలేదు కానీ చిత్రం ఎక్కువ భాగం జనవరి నెలలోనే వస్తుందని తెలుస్తోంది. జార్జి సి. విలియమ్స్‌ సినిమాటోగ్రఫి అందించిన ఈ చిత్రాన్ని మిత్రన్ డైరెక్ట్ చేయగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook