సెన్సార్ వారు మెచ్చిన ‘రన్ రాజా రన్’

సెన్సార్ వారు మెచ్చిన ‘రన్ రాజా రన్’

Published on Jul 28, 2014 7:02 PM IST

Run_Raja_Run-(2)

ఇప్పటివరకూ సీరియస్ పాత్రలు ఎక్కువగా చేసిన శర్వానంద్ మొదటిసారి లవర్ బాయ్ లుక్ లో కనిపించనున్న సినిమా ‘రన్ రాజా రన్’. ఈ సినిమా ఆగష్టు 01న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సుజీత్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ వారు ‘యు/ఏ’ సరిఫికేట్ ఇచ్చారు. అంతే కాకుండా ఈ సినిమాపై ప్రశంశల జల్లు కూడా కురిపించారు.

సెన్సార్ వారు సినిమా పూర్తయ్యాక పర్సనల్ గా మెచ్చుకున్నారని డైరెక్టర్ సుజీత్ అన్నాడు. ‘మొదటి నుంచే ఓ పెద్ద హీరో సినిమా అనుకొని చూసాం. సినిమా చాలా బాగుంది. చూస్తున్నంత సేపూ ఓ పెద్ద డైరెక్టర్ తీసిన ఫీలింగ్ వచ్చింది. అలాగే చివరి 30 నిమిషాలు సినిమాకి హైలైట్ అని సెన్సార్ వారు మెచ్చుకున్నారని’ డైరెక్టర్ సుజీత్ తెలియజేశాడు. శర్వానంద్ సరసన సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. ‘మిర్చి’ ఫేం వంశీ కృష్ణ – ప్రమోద్ లు ఈ సినిమాని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు