‘వైఎస్ఆర్ బయోపిక్’ లో నటించనున్న సీనియర్ హీరోయిన్ !

‘వైఎస్ఆర్ బయోపిక్’ లో నటించనున్న సీనియర్ హీరోయిన్ !

Published on May 22, 2018 12:31 PM IST

మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవితం ఆధారంగా ఓ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ భూమికను ఎంపిక చేసారు.

ఈమె వైఎస్సాఆర్ కుమార్తె, జగన్ సోదరి షర్మిల పాత్రలో నటించనున్నారు. మరి ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రకి ఎవరిని తీసుకుంటారో చూడాలి. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు చిత్ర బృందం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు