నిఖిల్ ‘శంకరాభరణం’లో హాట్ భామ!

నిఖిల్ ‘శంకరాభరణం’లో హాట్ భామ!

Published on Aug 1, 2015 7:00 PM IST

Sankarabharanam
సరికొత్త కథాంశాలతో రూపొందిన సినిమాలతో మనముందుకు వచ్చి, వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకున్న హీరో నిఖిల్. తెలుగులో ఏ హీరోకైనా హ్యాట్రిక్ హిట్ అన్నది అంత ఈజీ విషయం కాదు. నిఖిల్ ఆ ఘనతను కూడా సొంతం చేసుకొని ప్రస్తుతం ‘శంకరాభరణం’తో మరో సరికొత్త క్రైమ్ కామెడీ చేస్తున్నాడు. కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా ‘శంకరాభరణం’ సినిమాలో రెండో హీరోయిన్‌గా నటించేందుకు హాట్ భామ దీక్షా పంథ్‌ను ఎంపిక చేశారు. గతంలో హాట్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న దీక్షా, పవన్ కళ్యాణ్, వెంకటేష్‌ల ‘గోపాల గోపాల’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమాలో సన్యాసిని పాత్రలో కనిపించిన దీక్షా, ప్రస్తుతం ‘శంకరాభరణం’లో ఓ హాట్ ఎన్‌ఆర్‌ఐ అమ్మాయిగా కనిపించనుంది. ఇదే విషయాన్ని కోన వెంకట్ ఖరారు చేసేశారు. ఇక కొత్త దర్శకుడు ఉదయ్ నందనవనం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నందిత కనిపించనుంది. ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు