భావన కిడ్నాప్ కేసులో వెలుగుచూసిన సంచలన విషయాలు !

భావన కిడ్నాప్ కేసులో వెలుగుచూసిన సంచలన విషయాలు !

Published on Feb 19, 2017 12:52 PM IST


నిన్న తెల్లవారుజాయున కేరళలోని ఎర్నాకులం నుండి షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న ప్రముఖ సినీ నటి భావన కిడ్నాప్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వేధింపుల కేసును సీరియస్ గా తీసుకున్న కేరళ పోలీసులు చాలా చురుకుగా వ్యవహరిస్తూ పలు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. నిన్న బయటికొచ్చిన సమాచారం ప్రకారం ఈ కేసులో భావన కారు డ్రైవర్ మార్టిన్ తో పాటు ఆమె దగ్గరే పని చేస్తున్న మరో ఉద్యోగి సునీల్, మరొక వ్యక్తితో కలిపి మొత్తం ముగ్గురే ఇన్వాల్వ్ అయ్యారని అనుకున్నారు.

కానీ కేసును దర్యాప్తు చేసిన కేరళ డీజీపీ లోకనాథ్ బెహెర చెబుతున్న వివరాల ప్రకారం ఈ కేసు విషయమై మరో ఆరుగురు అనుమానితులని అరెస్ట్ చేసి విచారిస్తున్నారని, అన్ని దశల్లోనూ ఈ నేరంతో సంబంధమున్న వ్యక్తులను పట్టుకోవడానికి విచారణ కొనసాగుతోందని తెలుస్తోంది. కేరళ ముఖ్యమంత్రి పునరయి విజయన్ కూడా ఈ నేరంలో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యున్నారో తెలుసుకొని త్వరలోనే శిక్ష పడేలా చేస్తామని అన్నారు. ఇకపోతే తమ సహనటి పై జరిగిన ఈ దారుణానికి స్పందించిన పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తూ, ఈ దారుణాన్ని ఒక మహిళ కోణం నుండి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు