వెంకటేష్ అలాంటి పాత్ర చేయడం చాలా గ్రేట్ – శ్రీ ప్రియ

వెంకటేష్ అలాంటి పాత్ర చేయడం చాలా గ్రేట్ – శ్రీ ప్రియ

Published on Jul 22, 2014 3:21 AM IST

sripriya
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’. జూలై 11న విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ లోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఈ సినిమా చూడడం కోసం వస్తున్నారు. ఇప్పటికే ఈ ఇచ్నేమా చూసిన వారందరూ సినిమా చాలా బాగుందని, ఇలాంటి సినిమా చేసినందుకు వెంకటేష్ ని మెచ్చుకున్నారు. తాజాగా ఈ లిస్టులో ఈ చిత్ర డైరెక్టర్ శ్రీ ప్రియ కూడా వచ్చి చేరింది.

తాజాగా శ్రీ ప్రియ మీడియాతో మాట్లాడుతూ ‘వెంకటేష్ లాంటి హీరోతో పనిచేయడం చాలా ఈజీ. ఆయన డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంత ఇస్తాడు. ఒక స్టార్ హీరో అయ్యి ఉంది ఇద్దరి పిల్లల తండ్రిగా ఒక కామన్ మాన్ పాత్రలో చేయడం చాలా గ్రేట్. వెంకటేష్ సపోర్ట్ వల్లే సినిమా ఇంత బాగా చెయ్యగలిగానని’ చెప్పింది. మీన, నదియా, కృతిక, బేబీ ఎస్తర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని సురేష్ బాబు నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు