పాట కోసం యూరప్ వెళ్లనున్న స్టార్ హీరో హీరోయిన్లు !

పాట కోసం యూరప్ వెళ్లనున్న స్టార్ హీరో హీరోయిన్లు !

Published on May 21, 2018 8:30 AM IST

స్టార్ హీరో చియాన్ విక్రమ్, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కలిసి ‘సామి స్క్వేర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2003లో వచ్చిన ‘సామి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హరి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కారైకుడిలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో శరవేగంగా జరుగుతోంది.

త్వరలో ఒక పాట చిత్రీకరణ కోసం విక్రమ్, కీర్తి సురేష్ ఇద్దరూ యూరప్ వెళ్లనున్నారు. ఈ పాట ఒక డ్యూయెట్ గా ఉండనుంది. విక్రమ్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. విక్రమ్, హరి సినిమాలకి తెలుగునాట మంచి క్రేజ్ ఉండటం, కీర్తి సురేష్ ‘మహానటి’ లాంటి భారీ విజయాన్ని అందుకొని ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు మంచి స్థాయిలోనే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు