ప్రమోషన్ల వేగం పెంచిన సందీప్ కిషన్ టీమ్ !

మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మనసుకు నచ్చింది’. డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి టీమ్ అన్ని విధాల కృషి చేస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో మంచి గుర్తింపు రాగా ఇక పాటలను విడుదల చేయడం మొదలుపెట్టారు టీమ్.

ఇప్పటికే ఒక పాట విడుదలచేసి మ్యూజికల్ గా చిత్రం మంచి స్థాయిలో ఉంటుందని తెలిపి రెండవ పాట ‘చాటు మాటు’ ను రేపు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేయనున్నారు. ఇందులో సందీప్ కిషన్ కు జంటగా అమైరా దస్తూర్ నటిస్తోంది. పి. కిరణ్, సంజయ్ స్వరూప్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రతన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

 

Like us on Facebook