నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న సునీల్ మూవీ.

నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న సునీల్ మూవీ.

Published on Oct 30, 2014 7:49 PM IST

sunil
సునీల్ హీరోగా ‘జోష్’ ఫేం వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందించారు. ఇటివలే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఫ్యామిలీ వాల్యూస్ తో కూడిన ఎంటర్టైనింగ్ & ఎగ్జైటింగ్ స్టొరీ అని కోన వెంకట్ తెలిపారు. ‘మర్యాద రామన్న’ తర్వాత సునీల్ కు ఆ రేంజ్ హిట్ అందించే సినిమా అవుతుందని నిర్మాత దిల్ రాజు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దినేష్ సంగీతం అందిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. హీరోయిన్ ఎవరనేది ఇంకా వెల్లడించలేదు. సినిమా ప్రారంభోత్సవం నాడు సెప్టెంబర్ లో షూటింగ్ మొదలవుతుందని చెప్పినా లేట్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు