ఇంటర్వ్యూ : త్రిదా చౌదరి – స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బికినీ వేయడానికి సిద్దమే.!

ఇంటర్వ్యూ : త్రిదా చౌదరి – స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బికినీ వేయడానికి సిద్దమే.!

Published on Mar 6, 2015 4:36 PM IST

Trida1

హోళీ కానుకగా రిలీజ్ అయిన ‘సూర్య vs సూర్య’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ త్రిదా చౌదరి. త్రిదా చౌదరి ఈ సినిమాలో చేసిన టీవీ యాంకర్ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే త్రిదా చౌదరి లుక్స్ కి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అనిపిస్తోంది. ఈ సందర్భంగా త్రిదా చౌదరి తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) మొదటగా తెలుగులో సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది.?

స) ఇండియా వ్యాప్తంగా ‘క్లీన్ అండ్ క్లియర్’ ఫ్రెష్ ఫేస్ కోసం ఒక ఫ్యాషన్ కాంపిటీషన్ జరిపారు. 8 మెగా సిటీల నుంచి వచ్చిన మోడల్స్ మధ్య జరిగ్గిన కాంపిటీషన్ నేను పాల్గొని ఫైనల్స్ కి వచ్చాను. దాని ద్వారా కొన్ని కమర్షియల్స్ చేసాను. ఈ వీడియోస్ ని కార్తీక్ యు ట్యూబ్ లో చూసి తన పాత్రకి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. చెప్పాలంటే సంజన పాత్ర కోసం ఎలాంటి ఆడిషన్ కూడా చేయలేదు. కార్తీక్ కి నచ్చడంతో ఓకే చేసేసాడు.

ప్రశ్న) సంజన అనే టీవీ యాంకర్ క్యారెక్టర్ చేయడానికి ఏమన్నా హోం వర్క్ చేసారా.?

స) నా మొదటి తెలుగు సినిమాలోనే పెర్ఫార్మన్స్ కి ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. టీవీ యాంకర్ రోల్ అంటే నేను కాస్త భయపడ్డాను. ఆ పాత్ర చేయడానికి కాన్ఫిడెంట్ కావాలి. ఆ కాన్ఫిడెన్స్ ని కార్తీక్ ఇచ్చాడు. పర్టిక్యులర్ గా హోం వర్క్ చెయ్యలేదు కానీ కార్తీక్ చెప్పింది బాగా ఫాలో అయ్యాను. ఇక ఈ సినిమాలో చేసిన సంజన పాత్ర నా బిహేవియర్ కి కాస్త దగ్గరగా ఉంటుంది. సినిమాలో కార్తీక్ రెండు విభిన్న మనస్తత్వాలు ఉన్న సూర్య – సంజన లవ్ స్టొరీని బాగా చూపించాడు.

ప్రశ్న) నిఖిల్ తో పని చేయడం ఎలా ఉంది.? సెట్లో తను ఎంతవరకూ హెల్ప్ చేసాడు.?

స) నిఖిల్ వెరీ ఎనర్జిటిక్ పర్సన్. సెట్లో ఎప్పుడు అంతని ఎనర్జీ లెవల్స్ కి మ్యాచ్ అయ్యేలా ఉండడానికి ట్రై చేసాను. అలాగే నిఖిల్ చాలా హెల్ప్ చేసాడు. ఎక్కువ రీ టెక్స్ ఉండకూడదు, సమయం వృధా కాకూడదు అని ప్రతి సీన్ ని నాతో కూర్చొని నాకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాడు. చాలా వరకూ డైరెక్టర్ చెయ్యాల్సిన పనులని కూడా తనే చేసాడు.

ప్రశ్న) మీకు ఇది మొదటి సినిమా, కార్తీక్ కి ఇది తోలి సినిమా. అతని వర్క్ ఎలా అనిపించింది.?

స) కార్తీక్ ఇది మొదటి సినిమానే కానీ తనకి సూపర్బ్ టాలెంట్ ఉంది. డైరెక్టర్ గా అతనకి మొదటి సినిమా అయినా ఎంతో ప్రయోగాత్మక సినిమాని ఎంచుకున్నాడు. దాన్ని బట్టే అతని టాలెంట్ మనం తెలుసుకోవచ్చు. ఈ సినిమా 80% నైట్ లో తీసినా విజువల్స్ మాత్రం సూపర్బ్ గా ఉంటాయి. తనతో పనిచేయడం ఫెంటాస్టిక్ అనుభవం.

ప్రశ్న) బెంగాలీలో సినిమా చేసారు. మరి టాలీవుడ్ లో పనిచేయడం ఎలా ఉంది.?

స) టాలీవుడ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. బెంగాలీలో ఎక్కువ రియాలిటీ సినిమాలు ఉంటాయి. కానీ ఇక్కడ ధూమ్ ధామ్ అంటూ నడిచే కమర్షియల్ సినిమాలు ఉంటాయి. చెప్పాలంటే ఆ విషయంలో నాకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టం. ఇటీవలే టెంపర్ సినిమా చూసాను. ఎన్.టి.ఆర్ డాన్సులు అదరగొట్టాడు.

ప్రశ్న) పెర్ఫార్మన్స్ ఉన్న పాత్రలకేనా, గ్లామరస్ రోల్స్ కూడా చేస్తారా.? బికినీ వేయడానికి సిద్దమేనా.?

స) ఒక నటి అన్నాక అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్దంగా ఉండాలి. ఒక నటి అంటే ఎంతో ఎక్స్ ప్రెసివ్ గా ఉండాలి. అన్నిరకాల ఎమోషన్స్ పండించాలి. మనది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా సిద్దమే.. బికినీ అంటే.. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బికినీ వేయడానికి అభ్యంతరం లేదు. బికినీ వేయడానికి నా బాడీ కూడా సూట్ అవుతుందని అనుకుంటున్నాను.

ప్రశ్న) మీరు చేయాలనుకునే డ్రీం రోల్స్ ఏమన్నా ఉన్నాయా.?

స)మామూలుగా డాన్సులంటే హీరోలనే అంటాం. స్వతహాగా నేను ట్రెడిషనల్ డాన్సర్.. అందుకే డాన్స్ బేస్ కాన్సెప్ట్ తో ఓ సినిమా చేయాలని ఉంది. ఉదాహరణకి మాధురి దీక్షిత్ చేసిన ‘ఆజా నాచ్ లే’ సినిమా లాంటిది.

ప్రశ్న) నెక్స్ట్ తెలుగు సినిమాకి సైన్ చేసారా.?

స) సినిమా రిలీజ్ కి ముందే కొన్ని ఆఫర్స్ వచ్చాయి, కానీ సూర్య వస్ సూర్య రిలీజ్ అయ్యాకే ఫిక్స్ అవ్వాలని పక్కన పెట్టాను. సినిమా రిలీజ్ అయితేనే నా గురించి కూడా అందరికీ తెలుస్తుంది, ఆన్ స్క్రెన్ ఎలా చేసాను అనేది క్లారిటీ వస్తుంది. మరి కొద్ది రోజుల్లో ఉన్న ఆఫర్స్ లో ఓ మంచి స్క్రిప్ట్ ని సెలక్ట్ చేస్తాను. ప్రస్తుతం బెంగాలీ దర్శకుడు కమలేశ్వర్ ముఖర్జీతో ఓ బెంగాలీ సినిమా చేస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు