మొదటి షెడ్యూల్ ముగించుకున్న వరుణ్ తేజ్ మొదటి చిత్రం

మొదటి షెడ్యూల్ ముగించుకున్న వరుణ్ తేజ్ మొదటి చిత్రం

Published on Apr 18, 2014 1:00 PM IST

varun-tej
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా పరిచయం కానున్న సినిమా మొదటి షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్ ని కోచి, అలేప్పీ లలో గత మూడు వారాలుగా సినిమాను చిత్రీకరించారు. చిన్న విరామంతరువాత రెండో షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో పూజ హెగ్దే హీరోయిన్

ఈ సినిమాలో వరుణ్ వాలీబాల ఆటగాడిగా పల్లెటూరు నేపధ్యంలో పెరిగే కుర్రాడిగా నటించనున్నాడు. సినిమాలో చాలా భాగం తమిళనాడు, కొచ్చి, కేరళ, రాజమండ్రీ మరియు హైదరాబాద్ లలో తీయనున్నారు. సినిమాకు ముందే నటనలో శిక్షణ తీసుకున్న వరుణ్ పై మంచి అంచనాలే వున్నాయి

ఈ సినిమాను నల్లమలపు బుజ్జి, టాగూర్ మధు నిర్మిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతదర్శకుడు. మనికందన్ సినిమాటోగ్రాఫర్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు