తొలిప్రేమ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర ఇదే!

తొలిప్రేమ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర ఇదే!

Published on Jan 22, 2018 8:52 PM IST

వ‌రుణ్ తేజ్ , రాశిఖాన్న హీరో, హీరోయిన్స్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ప‌తాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిత‌మ‌వుతున్న చిత్రం `తొలిప్రేమ‌`.యువ ద‌ర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆడియో కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో పాపులర్ అయ్యింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో వరుణ్ తేజ్ సాఫ్ట్ వేర్ రోల్ లో కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తొలిప్రేమ టైటిల్ తో ఈ సినిమా రాబోతుండడంతో అందరి కళ్ళు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు