ఆస్ట్రేలియా వెళ్ళిన క్రికెట్ లవర్ వెంకటేష్

ఆస్ట్రేలియా వెళ్ళిన క్రికెట్ లవర్ వెంకటేష్

Published on Mar 26, 2015 8:33 AM IST

Venkatseh
ఈ రోజు ఇండియా మొత్తం అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న 2105 క్రికెట్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ మరికొద్ది సేపట్లో మొదలు కానుంది. ఈ మ్యాచ్ లో ఇండియా – ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం టాలీవుడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టాలీవుడ్ లో క్రికెట్ అంటే అంత్యంత ఆసక్తి ఉన్నవారిలో విక్టరీ వెంకటేష్ ప్రధముడు అని చెప్పాలి. ఆయన కుదిరినప్పుడల్లా లైవ్ క్రికెట్ మ్యాచ్ లకి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తారు.

ఈ రోజు ఆస్ట్రేలియాలో జరగనున్న క్రికెట్ మ్యాచ్ కోసం వెంకటేష్ ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇక్కడ కూర్చొని లైవ్ లో చూడడం కన్నా డైరెక్ట్ గా చూస్తేనే థ్రిల్ ఉంటుందనే ఉద్దేశంతో వెంకటేష్ ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఎంతో ఉత్కంఠ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ కోసం తెలంగాణా ప్రభుత్వం సెలవును కూడా ప్రకటించింది. మరి డీ అంటే డీ అని జరగనున్న ఈ మ్యాచ్ లో గెలుపెవరిది అనేది మరి కొద్ది గంటల్లో తెలిసిపోతుంది. మేము టీం ఇండియా గెలుపు సాధించి వరల్డ్ కప్ లో ఓటమి లేని టీంగా ఫైనల్స్ లోకి దూసుకెళ్ళాలని కోరుకుంటున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు