మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కమెడియన్…?

మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కమెడియన్…?

Published on May 27, 2016 12:41 AM IST

vennela-kishore
‘వెన్నెల’ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన కిశోర్ ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. తరువాత ఎన్నో సినిమాలలో కిశోర్ తన పాత్రల ద్వారా ప్రేక్షకులను నవ్వించాడు. ఇప్పుడు ఓ అరుదైన అవకాశం వెన్నెల కిశోర్ కి చిక్కింది.

అదేమిటంటే… మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఫిలిం అయిన ‘కత్తిలాంటోడు’ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు పనిచేయబోతున్న సాంకేతిక నిపుణులు, నటీనటులను ఎంపిక కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం మొదట సునీల్ ని అనుకున్న చిత్ర బృందం ఇప్పుడు ఆ స్థానంలో కమెడియన్ వెన్నెల కిశోర్ ని తీసుకున్నట్లు సమాచారం. నిజానికి సునీల్ ఈ సినిమాలో చేయడానికి తన అంగీకారం తెలిపినా ఈ సినిమా కోసం దాదాపు 40 రోజులు డేట్స్ కేటాయించవలసి ఉండడంతో సునీల్ ఈ సినిమానుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ పాత్రని వెన్నెల కిశోర్ తో చేయిస్తున్నారని తెలిసింది. అయితే ఈ విషయం గురించి అధికారికంగా ఎటువంటి వార్త రాలేదు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు