విడుదల తేదీ వార్తల్ని ఖండించిన విశాల్ !

విడుదల తేదీ వార్తల్ని ఖండించిన విశాల్ !

Published on Apr 23, 2018 10:22 PM IST


తమిళ స్టార్ హీరో విశాల్ సినిమాలంటే తెలుగునాట కూడ మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమాల్ని తమిళంతోపాటు తెలుగులో కూడ ఒకేసారి విడుదలచేస్తుంటారు. తాజా ఆయన నటించిన సినిమా ‘ఇరుంబుతిరై’ చాలా రోజుల క్రితమే పూర్తైనా నిర్మాతల మండలి బంద్ మూలాన ఆగిపోయింది. బంద్ ముగిసి ఒక్కో సినిమాకు విడుదలతేదీని కేటాయిస్తుండగా ఈరోజు ఉదయం నుండి సినిమా మే 11న విడుదలవుతుందని వార్తలోస్తున్నాయి.

వాటిపై స్పందించిన విశాల్ ఇంకా రిలీజ్ డేట్ ఖాయం కాలేదని, బయ్యర్లతో ఏర్పడిన చిన్న మిస్ కమ్యూనికేషన్ మూలంగా ఈ తప్పు జరిగిందని, త్వరలోనే నిర్మాతలు మండలి రిలీజింగ్ కమిటీతో చర్చలు జరిపి రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు. పి.ఎస్.మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదలచేయనున్నారు. ఇందులో విశాల్ కు జోడీగా స్టార్ హీరోయిన్ సమంత నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు