ప్రభాస్‍కు డబుల్ సైజ్ గిఫ్ట్ ఇస్తానన్న డైరెక్టర్!
Published on Oct 24, 2016 8:38 am IST

prabhas-sujith
బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా తన స్టార్ స్టేటస్‌ను పెంచేసుకున్న ప్రభాస్, ప్రస్తుతం బాహుబలికి రెండో భాగమైన బాహుబలి 2ను పూర్తి చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారని చాలాకాలం క్రితమే అనౌన్స్ అయింది. థ్రిల్లర్ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి సుజీత్ ప్రభాస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సుజీత్ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు.

ప్రభాస్ అన్న తనను అందరికంటే ఎక్కువగా నమ్మారని, ఆయన తనపై చూపిన ప్రేమకు డబుల్ సైజ్ ప్రేమను తన సినిమా ద్వారా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నానని సుజీత్ అన్నారు. సుమారు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా కూడా బాహుబలి తర్వాత ప్రభాస్‌కు వచ్చే స్టార్‌డమ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందట. బాహుబలి 2 పూర్తవ్వగానే ప్రభాస్ – సుజీత్ సినిమా మొదలవుతుంది.

 
Like us on Facebook