డబుల్ పవర్ చూపించిన ‘ఘాజి’ !

డబుల్ పవర్ చూపించిన ‘ఘాజి’ !

Published on Feb 26, 2017 8:00 PM IST


రానా ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఘాజి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇబ్బందీ లేకుండా వసూళ్లను రాబడుతోంది. భారతీయ సినీ చరిత్రలోనే మొట్టమొదటి సబ్ మెరైన్ డ్రామా కావడం, అద్భుతమైన కథం విజువల్స్ తో సినిమాను ఆసక్తికరంగా రూపొందించడంతో రెండో వారంలో సైతం చిత్ర కలెక్షన్లు చాలా స్టడీగా కొనసాగుతున్నాయి. ముఖ్యానంగా ఓవర్సీస్ లో అయితే ప్రేక్షకులు ‘ఘాజి’ కి బ్రహ్మరథం పడుతున్నారు.

మొన్న శుక్రవారం $26,990 వసూలు చేసిన ఈ సినిమా శనివారం అనూహ్య రీతిలో పుంజుకుని ఏకంగా 100 % గ్రోత్ కనబరుస్తూ $55,944 రాబట్టింది. దీంతో యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 4. 22 కోట్ల రూపాయలను కొల్లగోట్టింది. ఇక హిందీ వెర్షన్ సాధించిన రూ. 13. 8 కోట్లు, తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు కలుపుకుని ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ. 32.5 కోట్లు వసూలు చేసింది. పైగా వచ్చే శుక్రవారం వరకు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో చెప్పుకోదగ్గ భారీ సినిమాలేవీ లేకపోవడం కూడా ఈ సినిమాకు మరింత కలిసొచ్చే అంశం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు