‘టిక్:టిక్:టిక్’ ట్రైలర్ ఎప్పుడంటే !

‘టిక్:టిక్:టిక్’ ట్రైలర్ ఎప్పుడంటే !

Published on Jan 16, 2018 2:19 PM IST


తమిళ హీరో జ‌యం ర‌వి హీరోగా నటించిన రూపొందుతున్న త‌మిళ చిత్రం ‘టిక్‌: టిక్‌: టిక్’. తెలుగులో కూడా ఈ చిత్రం ఇదే పేరుతో రిలీజ్ కానుంది. శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో నివేద పెతురాజ్ హీరోయిన్ గా నటించింది.

ఇంతకు ముందే విడుదలైన సినిమా టీజర్ కు మంచి స్పందన రాగా చిత్ర ట్రైలర్ ను ఈ నెల 18న రిలీజ్ చేయనున్నారు. ఇండియాలోనే మొట్టమొదటిసారి అంతరిక్షం నైపథ్యంలో రూపొందుతునన్ ఈ చిత్రం టెక్నీకల్ గా అత్యుత్తమ స్థాయిలో ఉంటుందనే టాక్ వినబడుతోంది. డి.ఇమాన్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదలచేయనున్నారు. చదలవాడ పద్మావతి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సమర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు