రాహుల్ కొత్త సినిమా ఆడియో విడుదల తేది !

రాహుల్ కొత్త సినిమా ఆడియో విడుదల తేది !

Published on Jan 24, 2018 7:02 AM IST

రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘హౌరా బ్రిడ్జ్’. లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 26 న భారీగా ప్లాన్ చేసారు. టాప్ హీరో ఒకరు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. రేవన్‌యాదు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.

ఈఎంవిఈ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్ గా పనిచేసారు. విజయ్ మిశ్రా సినిమాటోగ్రఫి అందించాడు. ‘బూచమ్మా బూచోడు’ సినిమా తరువాత రేవన్ యాదు చేస్తున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. ఇకపోతే ఈ చిత్రం ఫిబ్రవరి 3వ వారంలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు