ఇంటర్వ్యూ: అదితిరావ్ హైదరి – సుధీర్ బాబుతో వర్క్ చేయడం చాలా సులభం

ఇంటర్వ్యూ: అదితిరావ్ హైదరి – సుధీర్ బాబుతో వర్క్ చేయడం చాలా సులభం

Published on Jun 13, 2018 3:57 PM IST

బాలీవుడ్ నటి అదితిరావ్ హైదరి తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘సమ్మోహనం’. ఈ శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ఈ సినిమా అవకాశం మీకెలా వచ్చింది ?
నేను వరుస సినిమాల్లో బిజీగా ఉండగా ఒకరోజు మోహన్ కృష్ణ ఇంద్రగంటిగారి నుండి కాల్ వచ్చింది. ఆయన ఐదు నిముషాల స్టోరీ లైన్ చెప్పారు. నేను పూర్తి నరేషన్ అడిగాను. ఆయన చెప్పారు. విన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా నేనే చేస్తాను, డేట్స్ కోసం కొంత ఆగండి అన్నాను. ఆయన కూడ ఒప్పుకున్నారు.

ఆన్ స్క్రీన్ మీద నటిలా నటించడం ఎలా ఉంది ?
నిజ జీవితంలో షూటింగ్ చేసేప్పుడు వచ్చే ఇబ్బందుల గురించి ఎలాంటి కంప్లైంట్స్ చెయ్యము. కానీ ఆన్ స్క్రీన్ మీద చాలా కష్టం. ప్రేక్షకులకు హీరోయిన్ల జీవితం అంటే సుఖంగా, అందంగా ఉంటుందనే ఊహ ఉంటుంది. కానీ నిజంగా అలా ఉండదు. లక్కీగా నాకు మొదటి సినిమాతోనే ఇంద్రగంటి లాంటి మంచి దర్శకుడు దొరికారు.

సుధీర్ బాబుతో వర్క్ చేయడం ఎలా ఉంది ?
అతని పాత సినిమాలు ఏవీ నేను చూడలేదు. కానీ బాలీవుడ్లో ‘భాగి’ సినిమా చేశాడని తెలుసు. చాలా సైలెంట్ గా ఉంటాడు. కానీ కెమెరా ముందు యిట్టె మారిపోతాడు. ఆతనితో వర్క్ చాలా సులభం.

తెలుగులో మాట్లాడటం కష్టమనిపించలేదా ?
నేను హైదరాబాద్లోనే పుట్టినా ఉత్తరాదిలోనే పెరిగాను. మా తాతగారు ఇంట్లో ఉర్దూ లేదా తెలుగులో మాట్లాడేవారు. కానీ నేను తెలుగు నేర్చుకోలేదు. సినిమాలో కూడ నాది నార్త్ హీరోయిన్ పాత్రే. ఇంద్రగంటిగారు నన్నే డబ్బింగ్ చెప్పుకోమన్నారు. చెప్పాను. చాలా బాగా కుదిరింది.

ఇకపై దక్షిణాది పరిశ్రమలో మీ ప్లాన్స్ ఏంటి ?
నాకు ప్రాంత బేధాలు లేవు. నాకు నచ్చిన సినిమాలే నేను చేస్తాను. నేను హిందీ సినిమాలు చేస్తూ హ్యాపీగా ఉండగానే మణిరత్నం సర్ ఫోన్ చేసి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నాను. నాకు భాష కూడ అడ్డు కాదు. అవకాశముంటే హాలీవుడ్, స్పానిష్ సినిమాలు కూడ చేస్తాను.

తెలుగులో ఎవరైనా దర్శకులతో పనిచేయాలని అనుకుంటున్నారా ?
ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి సినిమా చేస్తున్నాను. ఆయన మంచి దర్శకుడు. నాకు తరుణ్ భాస్కర్, శేఖర్ కమ్ముల తమిళంలో అయితే కార్తిక్ సుబ్బరాజ్ లాంటి దర్శకులతో పనిచేయాలని ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు