‘అల వైకుంఠపురములో’ ప్లాష్ బ్యాక్ అట ?

‘అల వైకుంఠపురములో’ ప్లాష్ బ్యాక్ అట ?

Published on Oct 12, 2019 12:00 AM IST

Alav

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా అప్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుందట. ఆ ప్లాష్ బ్యాక్ లో బన్నీ పాత్ర తాలూకు కొన్ని ఎమోషనల్ అంశాలు రివీల్ అవుతాయని.. అయితే కేవలం పది నిముషాలు మాత్రమే ఆ ప్లాష్ బ్యాక్ ఉంటుందని తెలుస్తోంది. ఇక వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

కాగా బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు