రాజమౌళి నిర్మించే ఏ మూవీ పైనైనా అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానితో పాటు జక్కన్న తన మూవీ గురించి ఎటువంటి ముఖ్యమైన విషయాలు, బయటికి రాకుండా దాచి జనాలకు మూవీ పై ఆసక్తి పెరిగేలా చేయడంలో మంచి దిట్ట. ఇన్ని నెలలుగా ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ జరుగుతున్నా ఎన్టీఆర్ మరియు చరణ్ ల లుక్ గురించి ఎటువంటి విషయం బయటకు రాకపోవడం ఆయన మూవీ విషయాలు, ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకు రాకుండా ఎంత జాగ్రత్తపడతారో అర్థం అవుతుంది. సెట్ లో పనిచేసే ఎవరైనా మొబైల్స్ ఉపయోగించకూడదనే కఠిన నియమాన్ని రాజమౌళి పాటిస్తారు.
రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ కొమరం భీమ్, అల్లూరి గెటప్స్ లో ఉన్న ఫోటోలు బయటపెట్టకుండా రాజమౌళి సెట్స్ లో ఎన్టీఆర్, చరణ్ సాధారణ ఫోటోలను విడుదల చేస్తున్నారు. రాజమౌళి పుట్టినరోజున లేదా దసరా పండుగ సందర్భంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తారంటూ అందరూ భావించారు. కానీ ఈ రెండు సందర్భాలలో ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు నిరాశే ఎదురైంది.
కాగా ఆర్ ఆర్ ఆర్ పై ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో కొన్ని పుకార్లు మొదలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ రాజమౌళి చెప్పినట్లుగా 2020కి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఇద్దరు హీరోలు గాయాలు పాలుకావడంతో పాటు ఇతర కారణాల వలన అనుకున్న ప్రకారం రాజమౌళి షూటింగ్ జరుపలేకపోయారు. క్వాలిటీ విషయంలో రాజీపడని రాజమౌళి, విడుదల తేదీ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. అందుకే ఆర్ ఆర్ ఆర్ టైటిల్, హీరోల లుక్స్ ఇప్పుడే విడుదల చేయడం మంచిది కాదని ఆయన భావిస్తున్నారని వినికిడి. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కానీ, ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.


