ప్రధాని స్వచ్ఛ్ భారత్ వీడియో పై ప్రకాష్ రాజ్ సెటైర్

ప్రధాని స్వచ్ఛ్ భారత్ వీడియో పై ప్రకాష్ రాజ్ సెటైర్

Published on Oct 12, 2019 9:44 PM IST

Prakash Raj\

ప్రధాని నరేంద్ర మోడీ చర్యలను, బీజేపీ పార్టీ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరో మారు మోడీపై సెటైర్ వేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలోని మామల్లాపురం బీచ్ లో మార్నింగ్ వాక్ చేశారు. పనిలో పనిగా ఆయన ఆ బీచ్ లో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కరే ఒంటరిగా తీరంలోని చెత్తను స్వయంగా సేకరించి శుభ్రపరిచారు. ఈ వీడియో నేటి ఉదయం నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో పాటు నేషనల్ న్యూస్ ఐయ్యింది.

ఐతే ఈ వీడియో పై స్పందించిన ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఆ వీడియో పోస్ట్ చేసి కామెంట్ చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని కెమెరా మెన్ తో పాటు, సముద్ర తీరంలో అలా వదిలేశారేంటి. ఫారిన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు ఆయన చేత చెత్త ఎలా ఏరిస్తారంటూ వ్యగ్యంగా స్పందించారు. ప్రచారం కోసం వీడియో గ్రాఫర్ ముందు ఆయన నటిస్తున్నారని అర్థం వచ్చేలా చెప్పారు. గతంలో కూడా అనేక విషయాలలో మోడీపై ప్రకాష్ రాజ్ సెటైర్స్ వేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు