ఆదివారం బిగ్ బాస్ షో ఉత్కంఠగా సాగనుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్న రాహుల్, వరుణ్, మహేష్ లలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఐతే నేటి బిగ్ బాస్ లో బాబా భాస్కర్ సంఘటన విస్మయానికి గురిచేసింది. ఆయన హోస్ట్ నాగార్జునకు అసలు బిగ్ బాస్ టైటిల్ గెలవాలన్న ఇంట్రెస్ట్ నాకు లేదని సమాధానం చెప్పి ఆయనకు షాక్ ఇచ్చారు.
విషయంలోకి వెళితే నాగ్ అడిగిన ఓ ప్రశ్నకు బాబా భాస్కర్ ఎమోషనల్ ఐయ్యారు.ఆయన కన్నీరు పెట్టుకున్నారు. దీంతో నాగార్జున అసలు నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటావని అస్సలు నేను అనుకోలేదన్నారు. నేను ఫెయిర్ గేమ్ ఆడాలని బిగ్ బాస్ కి వచ్చానని, మిగతా వాళ్ళు దానిని స్ట్రాటజీ గేమ్ అనుకుని నన్ను నిందిస్తే బాధేస్తుంది అన్నారు. అంతే కాకుండా తనకు బిగ్ బాస్ టైటిల్ గెలవాలన్న ఆసక్తే లేదు అని చెప్పడంతో నాగార్జున ఖంగు తిన్నారు. ఎవ్వరైనా అంత కష్టపడి ఆడేది టైటిల్ కోసమే, అలాంటిది అసలు టైటిల్ గెలవడమే ఇష్టం లేదని చెప్పి షో సీరియస్ నెస్ దెబ్బతీశారు.
#BabaBhaskar gets emotional#BiggBossTelugu3 Today at 9 PM on @StarMaa pic.twitter.com/p85DOk6i7j
— Starmaa (@StarMaa) October 13, 2019


