“RRR” రిలీజ్ ఈ టైం లో వద్దంటే వద్దు..!

“RRR” రిలీజ్ ఈ టైం లో వద్దంటే వద్దు..!

Published on Aug 21, 2021 10:00 PM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకున్నా పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒక టాప్ 3 తీస్తే అందులో ఖచ్చితంగా ఉండే చిత్రం “RRR”. దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రం ఈ ఏడాది కాదు వచ్చే ఏడాదికి ఫిక్స్ అయ్యింది అని స్ట్రాంగ్ బజ్ కూడా వినిపిస్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ సినిమాని త్వరగా థియేటర్స్ లో చూడాలి అని ఆశ పడుతున్న మూవీ లవర్సే ఇప్పుడప్పుడే ఈ చిత్రం రిలీజ్ వద్దు అంటున్నారు. దీనికి బలమైన కారణం కూడా లేకపోలేదు.

ప్రస్తుతం దేశమంతటా కూడా కరోనా వల్ల ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు విడుదల అయితే వసూళ్లు బాగానే వస్తున్నా మిగతా చోట్ల మాత్రం పరిస్థితి ఇంకా అలానే ముఖ్యంగా ఇటీవల వచ్చిన అక్షయ్ కుమార్ సినిమా “బెల్ బాటమ్” కి వస్తున్న వసూళ్లు చూసి ఒక్కొక్కరు షాక్ అవుతున్నారు.

దీనితో పాన్ ఇండియన్ లెవెల్లో ఎంతో స్పాన్ ఉన్న ఈ “RRR” సినిమా సేఫ్ జోన్ లో ఉండాలి అంటే ఇప్పుడు అక్టోబర్ నెలలో కన్నా పరిస్థితులు చక్కబడ్డాకే వస్తే బాగుంటుంది అని చాలా మందే అభిప్రాయపడుతున్నారు. దీనితో ఇప్పుడు ఈ చిత్రం ఒకవేళ వాయిదా పడుతుంది అని అనౌన్స్మెంట్ వచ్చినా పెద్దగా నిరాశపడే వారు ఎవరూ ఉండరని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు